డిజిటల్ తరగతులకు ఆల్బనీ ఆంధ్రా అసోసియేషన్ విరాళం
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఆల్బనీ ఆంధ్రా అసోసియేషన్ వారు రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆయనకు విరాళాన్ని అందజేశారు. సంఘం అధ్యక్షుడు వెంకట్ నిడమానూరి, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, డాక్టర్ ఓలేటి వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.













