ఆల్బనీ ఆంధ్రవార్షికోత్సవ సంబరాలకు మెనూ రెడీ
ఆల్భనీ ఆంధ్ర అసోసియేషన్ తన రెండవ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆల్బనీలోని హిందూ కల్చరల్ సెంటర్లో ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకోసం వచ్చే అతిధులకు పసందైన వంటకాలను కూడా సిద్ధం చేసింది. నోరూరించేలా ఉన్న ఈ మెనూ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనున్నది. ముంతమసాల, పెసర వడ, ఆలూ చిక్కుడుకాయ, కంది కట్టు, వెజ్ బిర్యానీ, ఉసిరి అవక్కాయ, కాప్సికం పన్నీర్, గోంగూర ఊరగాయ్, వంకాయ బఠానీ, క్యారట్ హల్వా, పాలకూర పప్పు, కొబ్బరి బూరెలను మెనూలో చేర్చింది. వచ్చిన అతిధులంతా తెలుగు వంటకాలను అస్వాధించాలని నిర్వాహకులు కోరుతున్నారు.













