అమెరికాలో టోర్నెడో బీభత్సం
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభవత్సం సృష్టించింది. వివిధ ఘటనల్లో 24 మంది చనిపోయారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. టోర్నడో బీభత్సవంలో కొంతమంది మిస్సింగ్ అయ్యారు. చాలా చోట్ల శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూటీమ్లు డ్రోన్స్ సాయంతో గాలిస్తున్నాయి. వివిధ ఘనటల్లో గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఆరేళలో సంభవించిన అతి పెద్ద టోర్నడో ఇదేనని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్న అధికారులు గాలింపు చర్యలు పూర్తయితేగానీ ఎంతమంది చనిపోయిందీ తెలియదంటున్నారు.













