ఘనంగా అక్కినేని అవార్జుల ప్రదానోత్సవం
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు ఐదో అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం కరీంనగర్లో జరిగింది. అతిథులుగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు లు అందుకున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, పవర్‌మెక్ కంపెనీ అధినేత సజ్జ కిశోర్‌బాబు, తిరుపతి సంగీత కళాశాల హరికథా విభాగాధిపతి ముప్పవరపు సింహాచలశాస్త్రి, ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ‘వనజీవి’ రామయ్య, వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తయారు చేసిన కమలాప్రసాదరావు, చేరుపల్లి వివేక్తేజ(మార్షల్ ఆర్ట్స్)లున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షు డు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, 2014లోమిత్రులమంతా కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. సంస్థ అధ్యక్షుడు రావు కల్వల కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సుద్దాల అశోక్‌తేజ. సజ్జ కిశోర్‌బాబు. ముప్పవరపు సింహాచల శాస్త్రి. ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ‘వనజీవి’ రామయ్య, కమలాప్రసాదరావు. చేరుపల్లి వివేక్తేజ అవార్డులను అందుకున్నారు.













