కరోనా వస్తుందని చేతులతో ముఖాన్ని తాకట్లేదు : ట్రంప్
కరోనా వైరస్ సొకుతుందన్న భయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా తన ముఖాన్ని చేతులతో తాకడం లేదు. వైట్‌హౌస్‌లో జరిగిన ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. సమావేశంలో వైట్‌హౌస్ కరోనా వైరస్ రెప్పాన్స్ కో ఆర్డినేటర్ బిర్కస్ మాట్లాడుతూ కరోనాను అడ్డుకోవాలంటే తరచూ చేతులు కడుక్కోవాలని, చేతులతో ముఖాన్ని తాకవద్దని చెప్పారు. దీనిపై ట్రంప్ పై విధంగా స్పందించారు. ముఖాన్ని చేతులతో తాకడాన్ని మిస్ అవుతున్నానని చెప్పారు. అయితే ఇటీవల ట్రంప్ తన చేతులతో తన ముఖాన్ని తాకిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.













