వాయు కాలుష్యంతో గుండెపోటు ముప్పు
ఓ రక్త గ్రూపు వారితో పోలిస్తే ఏ, బీ, ఏబీ (పాజిటీవ్, నెగటీవ్) రక్త గ్రూపులు కలిగి ఉన్నవారిలో వాయు కాలుష్యంతో గుండె పోటు వచ్చే ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏ, బీ, ఏబీ రక్త వర్గాలు కలిగి ఉన్నవారిలో ఏబీఓ అనే జన్యువు ఉంటుంది. ధమని కాఠిన్యత ఉన్న వారిలో గుండెపోటు ముప్పును ఈ ఏబీఓ జన్వువు పరీక్షలతోనే అంచనా వేస్తారు. అధిక వాయు కాలుష్యానికి గురైనప్పుడు ఏబీఓ జన్యువు కలిగి ఉన్నవారిలో గుండె పోటు ముప్పు ఎక్కువవుతోందని తాజా పరిశోధనలో గుర్తించినట్టు అమెరికాలోని ఇంటర్మౌంటేన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.













