లాస్ ఎంజెల్ కు ఎయిర్ ఇండియా సేవలు
ప్రముఖ విమానయన సంస్థ ఎయిర్ ఇండియా(ఎఐ) త్వరలో అమెరికాలోని మరో మూడు గమ్యస్థానాలకు విమానయాన సేవలను నడపనుంది. అంతేకాకుండా ఈ ఏడాది స్టాక్హ్మ్, నైరోబి (కెన్యా), టెల్ ఏవివ్(ఇజ్రాయిల్) ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించే యోచనలో ఉంది. అమెరికాకు నేరుగా నాన్-స్టాప్ విమానాలు నడపడంలో ఎయిర్ ఇండియాకు ఇది అయిదో గమ్యస్థానం కావడం విశేషం. జులై 7న వాషింగ్ట్న్కు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆశ్వని లోహని తెలిపారు. అలాగే సెప్టెంబరు 1నుంచి లాస్ ఎంజిల్స్, అనంతరం డల్లాస్‌కు నడపనున్నట్లు వెల్లడించారు. వీటికితోడు ఆగస్టు 15 నుంచి స్వీడిష్ రాజధాని స్టాక్హ్మ్కు సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇక ఇతర అవకాశాలు అందిపుచ్చుకునే పనిలో మార్గాల పునరుద్దరణపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ఇండియా తన విమానయాన సేవలను భారీగా విస్తరిస్తున్నట్టు లోహని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియపరిచారు.













