శీతాకాలం లో చికాగో నుండి ఇండియా కి 6 కొత్త విమాన సేవలు: ఎయిర్ ఇండియా
అమెరికా లో పనిచేసే విదేశీ ఉద్యోగస్తులకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సమయం లో సెలవులు ఎక్కువగా దొరికే అవకాశం ఉన్నందున ఆ సమయంలో విదేశీ ఉద్యోగస్తులు స్వదేశం వెళ్ళడానికి సరియైన సమయం గా భావిస్తారు. అందుకే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సమయంలో అమెరికా నుంచి స్వదేశానికి రావాలి అని అనుకునే వాళ్లు ఫ్లైట్స్ దొరక ఇబ్బంది పడుతూవుంటారు. అయితే ఎయిర్ ఇండియా సంస్థ ఒక అడుగు ముందుకు వేసి తమ ఇండియన్ కస్టమర్లు కు ఇబ్బంది కలగకుండా ఈ శీతాకాలం లో చికాగో నుండి ఇండియా కి 2020 అక్టోబర్ 25 నుండి 2021 మార్చి 27 వరకు 6 కొత్త VBM విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కొత్త విమాన సేవలు చికాగో నుండి ఢిల్లీ కి వేగవంతమైన సర్వీస్ గా పేర్కొంటూ ఈ విమానాలు ఢిల్లీ చేరుకున్న తక్షణం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి మరియు ముంబైలకు కనెక్టింగ్ ఫ్లైట్ సేవలు ఉంటాయి అని అంతేకాక చికాగో నుండి VBM AI విమానాలలో ప్రయాణించే ప్రయాణీకులందరూ వెబ్ లింక్‌లో నమోదు చేసుకోవాలి అని మరియు వెబ్ లింక్‌లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫారమ్‌ను సమర్పించాలి అని , ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుండి మినహాయింపు పొందాలని కోరుకునే ప్రయాణీకులు వెబ్ లింక్‌లో మినహాయింపు కోసం ఆన్లైన్ ఫారమ్‌ను కూడా సమర్పించవచ్చు . అయితే COVID 19 లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణించటానికి అనుమతించ నున్నందున COVID 19 పరీక్ష తప్పనిసరి కాదు అని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
ఈ కొత్త విమానాలలో ప్రయాణించే ప్రయాణికులకు సరికొత్త వినోదాన్ని మరియు ఆన్ బోర్డు మీల్ సర్వీస్ లో ఒక హాట్ మీల్, బేవరేజ్ సర్వీస్ మరియు ఒక ప్రీ ప్యాకెడ్ స్నాక్ బాక్స్ ని అందించనున్నటు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది













