ఆగస్టు 12న శాన్ఫ్రాన్సిస్కో వేదికగా ‘స్వదేశ్’ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో అమెరికాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘స్వదేశ్’ పేరిట జరిగే ఈ వేడుకల్లో అతిపెద్ద ఫ్లాగ్ వాక్ జరుగుతుంది. అలాగే డ్యాన్స్, సంగీతం, సింగింగ్ పోటీలు, ఫొటోగ్రఫీ, ఎస్సే రైటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, కారమ్స్, చెస్ తదితర క్రీడాపోటీలు కూడా నిర్వహించనున్నారు. శాన్ జోస్ వేదికగా ఆగస్టు 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. వీటిలో భాగంగా కార్నివాల్ రైడ్స్, ఫుడ్ ఫెస్ట్, షాపింగ్ బూత్లతోపాటు లైవ్ బ్యాండ్ పెర్ఫామెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘స్వదేశ్’ వేడుకలకు ముఖ్య అతిథిగా శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ విచ్చేయనున్నారు.













