కాన్సులేట్ అధికారి సంజయ్ పాండాను సన్మానించిన భారతీయ సంఘాలు
శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ పాండాను అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మిల్పిటాస్లోని ఫాల్కన్ ఎక్స్ ఈవెంట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియాలో ఉన్న దాదాపు 30 సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంజయ్ పాండా దంపతులను వేదికపై సగౌరవంగా ఆహ్వానించారు. వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు వేదికపైకి వచ్చి కాన్సల్ జనరల్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా
సంజయ్ పాండా మాట్లాడుతూ, కమ్యూనిటీకి సేవ చేస్తున్న వివిధ సంఘాలను, ఎఐఎను అభినందించారు. విదేశంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతిని కాపాడుతూ, రేపటితరానికి వాటిని అందిస్తున్న కమ్యూనిటీని ఆయన ఘనంగా ప్రశంసించారు. టిడిఎఫ్, బాటా వంటి సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బే ఏరియాలో సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. శ్రీనివాస్ మణికొండ, సంతోష్, రాజేష్ నాయర్, రవి పట్నాయక్, రమేష్ కొండ, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి, విజయ ఆసూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://photos.app.goo.gl/













