TANA: అమెరికాలో వ్యవసాయం.. చెంచు రెడ్డి తాడి చైర్-అగ్రికల్చరల్ ఫోరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నది. ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అగ్రికల్చరల్ ఫోరం ఆధ్వర్యంలో రైతుకోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తానా రైతుకోసం కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తానా మాజీ అధ్యక్షులు బండ్ల హనుమయ్య, చెంచు రెడ్డి తడి కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో విరాళాలు తీసుకొని, తెలుగు రాష్ట్రాల్లో పిపి కిట్‌లు (పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్) సాయిల్ టెస్టింగ్ , నైట్రోజన్ టెస్టింగ్ పరికరాలను అందిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో రైతు కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తున్నారు.
ఈసారి తానా కాన్ఫరెన్స్‌లో అమెరికాలో వ్యవసాయం (హాబీగా గాని, సీరియస్‌గాగాని) చేస్తున్న, విజయవంత మైన రైతులను ఆహ్వానించినట్లు కమిటీ నాయకులు పేర్కొన్నారు. అందులో 6 గురితో విజయవంతంగా వ్యవసాయం చేయడం ఎలా అనే ఇంటరాక్టివ్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ సెషన్‌లలో నేచురల్, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మెళుకువలు, ఏ స్టేట్స్‌లో ఎక్కడ ల్యాండ్స్ ఫార్మింగ్‌కి ఉపయోగ పడుతాయి? ఏ స్టేట్స్‌లో ఎక్కడ లోన్స్ దొరుకుతాయి? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఫెడరల్ లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి లభిస్తాయి? వంటి అనేక విషయాల మీద అవగాహన కలిగేలా ఈ సెషన్స్ ఉంటాయని అగ్రికల్చరల్ ఫోరం చైర్ చెంచురెడ్డి చెప్పారు.







