TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6, 2025న హారిస్‌బర్గ్ లోని సిల్వర్ స్ప్రింగ్ టౌన్షిప్లో ‘అడాప్ట్-ఎ-హైవే’ వాలంటీర్ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేÄటి, కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు పర్యవేక్షించారు. వీరందరూ వచ్చినవారిని ఉద్దేశించి స్ఫూర్తిదాయక మాటలతో వారిని ఉత్సాహపరిచారు. వందకు పైగా మధ్య, ఉన్నత పాఠశాల విద్యార్థులు తానా వాలంటీర్లతో కలిసి ఈ క్లీనప్ లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సమాజం పట్ల బాధ్యతను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తానా మిడ్-అట్లాంటిక్ నిర్వహణ బృందం సభ్యులు రాజు గుండాల, వెంకట్ ముప్పా, శ్రీను కోట, శ్రీనివాస్ అబ్బూరి, నవీన్ తోకాల, వేణు మక్కెన, కిషోర్ కొంక, రాకేష్ పైడి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశార. ఇందులో పాల్గొన్నవారికి రుచికరమైన అల్పాహారాన్ని అందజేశారు. వాలంటీర్ల కృషిని గుర్తిస్తూ వెంకట్ సింగు, ఫణి కంతేటి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు.
ఈ కార్యక్రమాన్ని విజయంతంగా నిర్వహించడంపట్ల తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇందులో పాల్గొన్నవారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవ, యువత భాగస్వామ్యం, మరియు పౌర గౌరవాన్ని పెంపొందించడంలో తానాకు ఉన్న చిత్తశుద్ధిని ఇది చాటిందని చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించినవారందరికీ మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.