విదేశీ విద్యార్థుల కోసం క్వీన్స్ యూనివర్సిటీ ఏర్పాట్లు
యూకేలోని 9వ అత్యంత పురాతన విశ్వవిద్యాలయం, బెల్ఫాస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న రసెల్ గ్రూప్ అనుబంధ క్వీన్స్ యూనివర్సిటీ, ఈ సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు స్వాగతం పలుకనుంది. నేరుగా, వర్చ్యువల్ విధానాల్లో క్లాసులు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులందరికీ 14 రోజుల క్వారంటైన్ ఏర్పాట్లు చేసి, ఆ తరువాతనే వర్శిటీలోకి ఆహ్వానిస్తామని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఐయాన్ గ్రీర్ వెల్లడించారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించామని, క్లాసుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేశామని అన్నారు.













