కూచిభొట్లను చంపింది నేనే
అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఎట్టకేలకు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. ఇందులో తన తప్పేమీ లేదని మొదటినుంచీ వాదిస్తున్న నిందితుడు ఆడమ్ వ్యూరింటన్, తాజా విచారణలో తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసులో మే 4న శిక్ష ఖరారు కానుంది. హత్య కేసులో అతడికి జీవిత ఖైదుతో పాటు హత్యాయత్నం ఆరోపణలపై కనీసం 12 ఏళ్ల నుంచి గరిష్టంగా 54 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ రోజు నిందితుడు తన నేరాన్ని అంగీకరించడం నా శ్రీనుని తిరిగి తీసుకురాలేదు. కానీ, జాతీ విద్వేషం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందిస్తుంది అని శ్రీనివాస్ భార్య సునయన దూమాల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.













