గొల్లపూడి మారుతీ రావు గారి నిర్యాణం
మనందరికీ ఆత్మీయులు, నాకు చిరకాల మిత్రులు అయిన గొల్లపూడి మారుతీ రావు గారు నిన్న ఉదయం చెన్నై లో గుండె పోటు తో పరమ పదించారు. గత కొన్నాళ్ళగా అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. గత నాలుగేళ్ళగా మన “మధురవాణి” పత్రికలో “నా డైరీలొ ఒక పేజీ” అనే ధారావాహిక లో గొల్లపూడి గారు తమ జీవితం లో ఆసక్తికరమైన ఎన్నో సంగతులను పంచుకుంటున్నారు. గత పాతికేళ్ళగా దేశ విదేశాలలో ఆయన వందలాది సాహిత్య కార్యాక్రమాలలో, టెలివిజన్ చర్చలలో పాల్గొని, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ కీ, నాకు వ్యక్తిగతంగానూ స్పూర్తి ప్రదాత గా నిలిచారు. ఆయన నిర్యాణం ఎంతో బాధాకరం.
తెలుగు సాహిత్య చరిత్రలొ ఆయన స్థానం, సినీ చరిత్రలో నటుడిగా, రచయితగా అయన సాధించిన విజయాలు, మేధావిగా, నాటక ప్రయోక్తగా, వక్తగా గొల్లపూడి మారుతీ రావు గారికి ఉన్న అంతర్జాతీయ ప్రఖ్యాతి గురించి ఎంత చెప్పినా తక్కువే!
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని ప్రార్ధిస్తూ….
వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054













