అమ్మకానికి లింకన్ ముంగురులు, టెలిగ్రాం లేఖ
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ముంగురులు, 1885లో ఆయన హత్య సందర్భంగా రక్తపు మరకలతో ఉన్న టెలిగ్రాం లేఖను విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూ హంప్‌షైర్‌లో సెప్టెంబరు 12న వేలం నిర్వహించనున్నారు. ఇందుకోసం బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ సంస్థ ఆన్లైన్లో బిడ్డింగ్ తెరిచినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే కనీసం వేలం మొత్తాన్ని 10 వేల డాలర్లుగా నిర్ణయించింది. అయితే 75 వేల డాలర్ల కంటే అధికంగానే ఈ వస్తువులు ధర పలికే అవకాశం ఉందని ఆర్ఆర్ సంస్థ ప్రతినిది మైక్ గ్రాఫ్ తెలిపారు. లింకన్ హత్య అనంతరం నిర్వహించిన పోస్టుమార్టం సందర్భంగా ఆయన ముంగురులను భద్రపరిచినట్లు గ్రాఫ్ వెల్లడించారు.













