నిరుద్యోగ సైన్యంలో మరో 52 లక్షల మంది చేరిక
అమెరికా నిరుద్యోగ సైన్యంలో మరో 52 లక్షల మంది తాజాగా చేరారు. గత వారంలో నిరుద్యోగ భృతి కోసం 52 లక్షల మంది అమెరికన్లు దాఖలు చేసుకున్నారని కార్మిక శాఖ ప్రకటించింది. తాజా నివేదికతో గత నెల రోజుల్లో నిరుద్యోగల సంఖ్య 2 కోట్ల 20 లక్షలకు చేరింది. గత వారం కోటీ 60 లక్షలుగా వున్న ఈ సంఖ్య అమాంతంగా 2 కోట్లను దాటడంతో గ్రేట్ ఆర్థిక మాంద్యం నాటి నుండి వచ్చిన ఉద్యోగాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం కార్మికుల సంఖ్యలో ఈ 2 కోట్ల 20 లక్షల మంది నిరుద్యోగులు దాదాపు 13 శాతంగా వున్నారు. గత నివేదికలో 66 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగపు భృతి కోసం దరఖాస్తు చేసుకోగా, ఈ వారం 50 లక్షలు దాటవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రలడానికి ముందు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6,95,000గా వుంది.













