‘కరోనా’ టెస్ట్ 5నిముషాలే…
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షకు ప్రస్తుతం ఒకటి రెండు రోజుల సమయం పడుతోంది. కానీ ఈ పరీక్షను నిమిషాల్లోనే పూర్తి చేసేందుకు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. మనిషికి కరోనా ఉందో లేదో ఐదు నిమిషాల్లోనే తేల్చేసే పక్రియను అమెరికాకు చెందిన ఓ సంస్థ అభివ•ద్ధి చేసింది. అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరిసీస్ అభివ•ద్ధి చేసిన ఈ విధానానికి అత్యవసర పక్రియ కింద ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి కూడా ఇచ్చింది. అయితే తమకు పూర్తి స్థాయి అనుమతి రాలేదని సదరు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్లో అత్యవసర ప్రాతిపదికన ఈ పక్రియను ఉపయోగించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వచ్చే వారం నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఈ పక్రియలో కరోనా వైరస్ వుంటే కనుక ఫలితం ఐదు నిమిషాల్లోనే వస్తుందని తెలిపింది. నెగిటివ్ ఉంటే మాత్రం ఫలితం రావడానికి 13 నిమిషాల సమయం పడుతుందని వెల్లడించింది.













