AAA: ఎఎఎ మహాసభల్లో బిజినెస్ ఫోరం చర్చాకార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహాసభల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, బిజినెస్ సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ బిజినెస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అమెరికాలో రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి ఇతర అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు. అనిల్ అట్లూరి, ప్రసాద్ కునిశెట్టి, తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుతోపాటు పలువురు పాల్గొని మాట్లాడనున్నారు.







