అమెరికాలో ఖమ్మం విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడి
అమెరికాలో ఎంఎస్ చదువుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందని విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంఘటన వెలుగు చూసింది. యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్(29) ఎంఎస్ చదువుతూ పార్టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆసుపత్రి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.













