ది కరోల్ షీల్డ్స్ ప్రైజ్ మనీ లక్ష డాలర్లు
అమెరికా సాహిత్యం రంగంలో విశిష్ట సేవలు అందించిన వారి ఒకి భారీ పారితోషికాలు ఇవ్వబడుతాయి. అయితే ఇందులో విజేతలు ఎక్కువ మంది పురుషులే ఉంటారు. గత 20 ఏళ్లలో ఆరుగురు మహిళలకు మాత్రమే సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. 2022 నుంచి ది కరోల్ షీల్డ్స్ ప్రైజ్ మనీని లక్ష డాలర్లకు (సుమారు 71,50,297)కు పెంచడం జరిగింది. అప్పటికి ఈ సాహిత్య పురస్కారాన్ని అందుకునేందుకు ఉత్తర అమెరికా వ్యక్తికి అర్హత లేదు. అవార్డు పొందిన కవులు, రచయితలు ఈ పురస్కారానికి ప్రాణం పోశారు. మార్గరెట్ అట్వుడ్, జోడి పికౌల్ట్, జేన్ స్మైలీతో పాటు ఇతర రచయితల వారికి మద్దతుగా నిలిచారు. సాహిత్య నైపుణ్యం ప్రదర్శించిన స్త్రీ లేదా పురుషుడికి ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది.
ఈ సాహిత్య అవార్డు వ్యవస్థాపకుడు, కెనడాకు చెందిన నవలా రచయిత సుసాన్ స్వాన్ మాట్లాడుతూ వ్యవస్థాపక బోర్డు అవార్డు ఎంపికలో వ్యత్యాసాన్ని గమనించిందని, మహిళల కంటే ఎక్కువ పురుష రచయితలే ఈ అవార్డు దక్కించుకుంటూ వస్తున్నారని, మహిళల కోసం యూకేలో ప్రెస్టీజియస్ ప్రైజ్, ఆస్ట్రేలియాలోని స్టెల్లా, ఫ్రాన్స్‌లో లా ప్రిక్స్ ఫెమినా ఉందని తెలిపారు. కానీ యూఎస్‌కు చెందిన అదే స్థాయి సమాన బహుమతి లేదన్నారు. ది స్టోన్ డైరీస్ లో భాగంగా 1995లో పులిట్టర్ బహుమతి పొందిన రచయిత్రిని.. కరోల్ షీల్డ్స్ కోసం రెఫర్ చేయడం జరిగిందన్నారు.













