అమెరికాలో అరుదైన ఫైర్నాడో
అసలే కార్చిచ్చు ఆపై సుడిగాలితో కలిసి భగభగలాడే అగ్నిగోళం వలే ఆ ప్రాంతాన్ని చుట్టేస్తే ఇలాంటి దృశ్యమే అమెరికాలో లూసియానాలో ఆవిష్కృతమైంది. ఇక్కడ సబినే పారిస్ అనే ప్రదేశంలో కార్చిచ్చుతో టోర్నడో కలిసి అత్యంత అరుదుగా కనిపించే ఫైర్నాడోగా మారింది. అంతే వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కదులుతూ చూపరులను భయాందోళనకు గురి చేసింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా బలహీనపడింది. ఈ దృశ్యాన్ని కొందరు చిత్రీకరించారు. లూసియానా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ కమిషనర్ మైక్ స్ట్రైక్ మాట్లాడుతూ లూసియానాలో వ్యాపిస్తున్న కార్చిచ్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి స్థానికులకు పెనుముప్పుగా మారాయన్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో చాలా మందిని కార్చిచ్చులను దగ్గర నుంచి చూసేందుకు ప్రయత్నించడమో, డ్రోన్లను పంపడమో చేస్తున్నారని ఇది ప్రమాదకరమని వెల్లడించారు.













