ఓ అమెరికన్ చివరి కోరికను తీర్చిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమెరికన్ చివరి కోరికను తీర్చారు. ట్రంప్‌కు వీరఅభిమాని అయిన బ్రెట్ అనే వ్యక్తి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. బ్రెట్ మరో ఆరు నెలల్లో చనిపోతాడని డాక్టర్లు సృష్టం చేయగా, మనశాంతి కోసం బ్రెట్ తన సోదరి ఇంటికి వెళ్లిపోయి అక్కడే చికిత్స పొందుతున్నాడు. బ్రెట్ రిపబ్లికన్ మద్దతుదారుడు కాగా, బ్రెట్ సోదరి బ్రిడ్జెట్ డెమెక్రట్ పార్టీకి మద్దతురాలు. అమె వెస్ట్ హ్యానెట్ సిటీ కైన్సిల్వుమెన్గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌తో ఒక్కసారైనా మాట్లాడాలనేది తన సోదరుడి ఆశయమని తెలుసుకున్న బ్రిడ్జెట్.. తన సోదరుడి పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
స్నేహితులు, మద్దతుదారుల సహాయంతో వైట్ హౌస్‌కు మెయిల్స్ పంపింది. ఆమె మెయిల్స్‌కు వైట్ హౌస్ స్పందించింది. మంగళవారం రాత్రి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రెట్‌కు ఫోన్ చేశారు. నేను మీకు పెద్ద అభిమానిని. ఎలాంటి సందర్భాలలోనైనా నేను మీకే మద్దతిస్తా అని బ్రెంట్ ట్రంప్‌తో అన్నాడు. బ్రెట్ నువ్వు ఒక చాంప్వి. నిన్ను చూసి గర్వపడుతున్నా. ఆశయాలను సాధించేందుకు మనిద్దరం పోరాడుతూనే ఉందాం. నీ ఆరోగ్యం మెరుగుపడ్డాక నీతో మళ్లీ మాట్లాడుతా అని బ్రెట్ కోరికను తీర్చారు. ట్రంప్‌తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ రీజనల్ చీఫ్ లైన్ పాటన్ కూడా బ్రెట్తో ఫోన్లో మాట్లాడారు.













