భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఉపకార వేతనం
ప్రతిష్ఠాత్మక డేవిడ్సన్ ఉపకారవేతనాన్ని ఆరుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు దక్కించుకున్నారు. దీంతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని భారత నేపథ్యమున్న బాలల హవా మరోసారి కొనసాగింది. ఏటా అమెరికాలో 20 మంది ప్రతిభావంతులైన 18 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులకు డేవిడ్సన్ ఇన్స్టిట్యూట్ ఈ ఉపకారవేతనాలు అందిస్తుంది. ప్రపంచంలోనే తొలి పది ప్రఖ్యాత ఉపకారవేతనాల్లో ఒకటిగా వీటికి పేరుంది. ప్రస్తుతం వర్జీనియాకు చెందిన 18 ఏళ్ల కొప్పరపు కావ్య, కనెక్టికట్‌కు చెందిన 17 ఏళ్ల రాహుల్ సుబ్రమణ్యంలకు రూ.36.39 లక్షల (50,000 డాలర్ల) ఉపకారవేతనం దక్కింది. అరిజోనాకు చెందిన సచిన్ కోనన్, వర్జీనియాకు చెందిన మరిస్సా సుమతిపాల, న్యూజెర్సీకి చెందిన ఈషన్ త్రిపాఠిలు రూ.18.34 లక్షలు(25,000 డాలర్లు) నగదు ప్రోత్సాహకం దక్కించుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన 18 ఏళ్ల రాజీవ్ మొవ్వ రూ.7.33 లక్షల (10,000 డాలర్ల) ఉపకారవేతనం పొందారు.
క్యాన్సర్‌పై పరిశోధనకుగాను, కావ్వ, జికా వైరస్పూ హెచ్చరికలు జారీచేసే వ్యవస్థ రూపకల్పనకుగాను సుబ్రమణ్యం ఈ ఉపకారవేతనాలకు ఎంపికయ్యారు. వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సు తోడ్పాటుతో ఈషన్, భూకంప బాధితులను కనుగోనే వ్వవస్థతో సచిన్, సరికొత్త హృద్రోగ విధానంతో సుమతిపాల, డీఎన్ఏ క్రమం గుట్టు విప్పే కంప్యూటర్ నమూనాతో రాజీవ్‌లకు ఈ నగదు ప్రోత్సాహకం లభించింది.













