America: విషాదాన్ని మిగిల్చిన ఎన్‌ఆర్‌ఐ వృద్ధుల అదృశ్య ఘటన
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది. అమెరికాలో బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియా (West Virginia)లోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి ఇటీవల కారు (Car)లో బయలుదేరిన వీరు కనిపించకుండా పోయారు. వీరు రోడ్డు ప్రమాదం (Road accident లో మృతి చెందినట్లు మార్షల్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం ప్రకటించింది. ఈ వృద్ధులు (Elderly) ప్రయాణించిన కారు ఓ ఎత్తైన రోడ్డులో అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. మృతి చెందిన వారిని ఆశ దివాన్(85), కిషోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీత దివాన్(84)గా గుర్తించారు. జూలై 31 నుంచి వీరి నుంచి ఎటువంటి సమాచారం లేకుండా పోయిందని మార్షల్ కౌంటీ షెరిఫ్ డార్తీ తెలిపారు.







