నలుగురు దౌత్యవేత్తలకు దీవాలీ పురస్కారాలు
శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన కృషికి గాను నలుగురు ప్రముఖ దౌత్యవేత్తలకు ద దీవాలీ- పవర్ ఆఫ్ వన్ పురస్కారాలు దక్కాయి. వీరు కజకిస్థాన్‌కు చెందిన కైరాత్ అబ్ద్రాఖ్మనోవ్, సైప్రస్ దౌత్యవేత్త నికోలస్ ఎమ్లియోవ్, స్లొవేకియాకు చెందిన ఫ్రాంటియెస్క్ రుజికా, ఐరాసలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి వోలోదిమిర్ యెల్చెంకో. ఈ పురస్కారాలను దౌత్యంలో ఆస్కార్ లుగా పరిగణిస్తారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో వీటిని ప్రదానం చేశారు. అమెరికాలోని దీవాలీ ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రారంభించింది.













