ఫ్లోరిడాలో విషాద ఘటన…
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు విషాదంగా మారాయి. అక్కడ జరిగిన కాల్పుల ఘటనలో ఓ మత బోధకుడు, నిందితుడు సహా నలుగురు మరణించారు. ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు ధ్రువీకరించారు. బ్రాండన్ కపాస్ (24) అనే వ్యక్తి తన తాత ఇంట పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా పోలీసులతో ఘర్షణకు దిగాడు. తప్పించుకునే యత్నంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడి తాతయ్య విలియం కపాస్ మృతిచెందాడు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని కాల్చి చంపకతప్పలేదని వెల్లడిరచారు. దర్యాప్తులో భాగంగా అతడు ఉపయోగించిన కారును తనిఖీ చేయగా అందులో పలు రకాల చేతి తుపాకులు, రైఫిల్స్ లభ్యమైనట్లు తెలిపారు. అతని వాహన రిజిస్ట్రేషన్ పరిశీలన సందర్భంగా ఓ ఇంట్లో ఓ మతబోధకుడు రాబర్ట్ హోఫ్నర్, అతని సోదరి సాలి హోఫ్నర్ మృతదేహాలు లభ్యమైనట్లు వివరించారు.







