మధుమేహాన్ని ముందే గుర్తించొచ్చు!
టైప్-2 మధుమేహాన్ని గుర్తించడంలో కొవ్వుకణాల నుంచి విడుదలై రక్తనాళాల నుంచి ప్రవహించే ఎక్సోజోములు, చిన్ని నానోపార్టికల్స్ సహాయపడతాయని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. శరీరంలోని ఆరోగ్యకర కొవ్వు కణాలు అనారోగ్యం పాలైనప్పుడు విపరీతంగా బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం ఉన్న యువకుల్లో టైప్-2 మధుమేహం అభివృద్ధి చెందడానికి కారణాలను గుర్తించేందుకు 12-17 ఏళ్ల వయసున్న 55 మందిపై అధ్యయనం చేశారు. మెటబాలిజం, బాడీ కంపోజిషన్, టీనేజర్ల రక్తంలో పెరిగిన విసెరల్ కొవ్వు నిల్వలు, బ్లడ్ ఘుగర్ను ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో గుర్తించారు.













