అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం
అమెరికాలో మరో సారి కాల్పుుల మోతతో దద్దరిల్లింది. ముసుగులు ధరించి ఆయుధాలు కలిగిన ఇద్దరు దుండగులు జన సమూహం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘనటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అమెరికాలోని న్యూ ఓర్లియాన్ నగరంలో ఈ ఘనట చోటు చేసుందుకుంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యూఓర్లియాన్ నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ సమీపంలో ఉన్న క్లాయ్ బోర్న్ అవెన్యూలో ఈ కాల్పులు జరిగాయి. పోలీస్ ఉన్నతాధికారి మైఖేల్ హార్రిన్ సన్ మాట్లాడుతూ దుండుగులు ఇ్దదరు హ్యాండ్ గన్తో వ్యాపారుల గుంపుగా లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారని అన్నారు. పలురౌండ్ల కాల్పులు జరిపిన తరువాత వారు అక్కడి నుంచి పారిపోయారని, వ్యక్తిగత తగాదాలే దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారిలో ఏడుగురిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు.













