యూఎస్ స్పేస్ క్యాంప్ లో భారతీయ ప్రతిభ
హనీవెల్ లీడర్ షిప్ ఛాలెంజ్ అకాడమీ (హెచ్ఎల్సీఎ)లో 35 దేశాలకు చెందిన 325 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, వారిలో 23 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని హనీవెల్ తెలిపింది. ఈ విశిష్ట నాయకత్వ కార్యక్రమం వరుసగా రెండువారాల పాటు అలబామాలోని హంట్స్ విల్గేల్లో యూఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రం 16 నుంచి 18 ఏళ్లు లోపు విద్యార్థులకు ఇంటరాక్టివ్ టెక్నాలజీ, సైన్స్ ఓరియంటెడ్ వర్క్‌షాప్స్, టీమ్ ఎక్సర్‌సైజ్‌లను అందించడంతో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మేథ్స్ ఎడ్యుకేషన్ అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మృదంగ పటేల్ మాట్లాడుతూ అకాడమీలో తాను ఆస్ట్రోనాట్లో శిక్షణ పొందానని ఇప్పుడు షటిల్ మిషన్స్, రాకెట్ లాంచ్ సిమ్ములేటర్ను ఆత్మవిశ్వాసంతో ఆపరేట్ చేయగలనన్నారు.













