4 నుంచి తానా మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు ఈ నెల 4 నుంచి మూడురోజుల పాటు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న వాల్టర్ ఈ.వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. సభలకు ప్రత్యేక ఆహ్వానితులుగా సినీనటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌లు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తానా అధ్యక్షుడు సతీశ్ వేమన, తానా సభల సమన్వయకర్త డాక్టర్ మూల్పూరి వెంకటరావు, సభల చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. పలురంగాల ప్రముఖులు, నిష్ణాతులు కూడా వేడుకల్లో పాల్గొంటారని వారు వెల్లడించారు.
మూడురోజుల పాటు కీరవాణి, సునీత, తమన్ల మూడు సంగీత విభావరులు అలరించనున్నాయన్నారు. జిల్లాల ప్రవాసులు సభల్లో కలుసుకొని తెలుగువారి ఔన్నత్యాన్ని చాటనున్నారని పేర్కొన్నారు. ఈ సభల్లో తానా నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి జయశేఖర్ బాధ్యతలు స్వీకరిస్తారు.













