తానా వేడుకలు చూతము రారండి
ముస్తాబైన వాషింగ్టన్ డీసి కన్వెన్షన్ సెంటర్
అమెరికాలో అతి పెద్ద తెలుగు పండుగ వేడుకకు వాషింగ్టన్ డీసిలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభలు అతిపెద్ద తెలుగు పండుగగా గుర్తింపును తెచ్చుకున్నాయి. వాషింగ్టన్ డీసీలో నిర్వహించే ఈ తానా 22వ మహాసభలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రెసిడెంట్ సతీష్ వేమన సారధ్యంలోని కాన్ఫరెన్స్ బృందం అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలసంఖ్యలో వస్తున్న తెలుగువారికి ఆతిధ్యం ఇచ్చేందుకు కాన్ఫరెన్స్ నాయకులు సిద్ధమయ్యారు.
అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం, మాతృభూమితో వారి బంధాన్ని పటిష్ఠం చేయడం కోసం ఈ మహాసభలను తానా ప్రతి రెండేళ్ళ కోమారు నిర్వహిస్తోంది. ‘తానా’ మహాసభలు వస్తు న్నాయంటే అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాల్లో ఓ సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మహాసభలు జరిగే మూడురోజులు ఎల్లెడలా కనిపించే తెలుగు వాతావరణం, తెలుగు వంటకాలు, ఇండియా నుంచి వచ్చేవారి తెలుగు మాటలు, ప్రసంగాలు వినడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎంతోమంది ప్రముఖులను, సినిమా నటీనటులను, ఇతరు లను ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఈ?మహాసభల ద్వారా కలుగు తుంది. రాజకీయ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖు లను స్వయంగా కలుసుకుని పలకరించే అవకా శం కూడా ఈ వేడుకల ద్వారా ఉండటంతో ఎంతోమంది ఈ మహాసభలకు హాజరవుతుంటారు. సాధ్యమవుతుంది. అందుకే అమెరికాలో తానా మహాసభలు జరిగే ఈ మూడురోజులు తెలుగువాళ్ళకు పండుగే.
సినీరంగానికి చెందిన సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పలువురు ఈ కాన్ఫరెన్స్‌కు తరలివస్తున్నారు. సంగీత దర్శకులు, కీరవాణి, థమన్‌తోపాటు గాయనీ గాయకులు సునీత, కౌసల్య, హేమచంద్ర, దీపు, రామాచారి, శ్రీనిధి తదితరులు వస్తున్నారు. జబర్దస్త్ టీం కూడా కాన్ఫరెన్స్‌లో షో చేసేందుకు వస్తోంది. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష, యాంకర్ రవి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు.
కాన్ఫరెన్స్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలువురు వస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద, డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి, భువనగిరి సత్యసింధుజ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసకళ్యాణ వేడుకలను కూడా వైభవంగా జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తానా బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా పలువురు బిజినెస్ ప్రముఖులు హాజరవుతున్నారు. కపిల్‌దేవ్, వినయ్ తుమ్మలపల్లి, గారి రప్పపోర్ట్, వెంకటపతి పువ్వాడ, రాజ్ దేవులపల్లి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యసించనున్నారు.
మహిళల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలను, యూత్ కోసం పసందైన కార్యక్రమాలను కూడా కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేశారు. తానా మేట్రిమోని కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. తానా స్టార్టప్ క్యూబ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ధీమ్‌తానా పేరుతో కమ్యూనిటీని మహాసభల్లో పాల్గొనేందుకు వీలుగా వివిధ నగరాల్లో మిస్తానా, మిస్‌టీన్ తానా, మిసెస్ తానా పేరుతో అందాల పోటీలను, సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లో విజేతలైన వారితో ఫైనల్ పోటీలను తానా మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు. క్యూరీ-తానా పేరుతో చిన్నారులకు సైన్స్, మ్యాథ్స్, స్పెల్‌బీ వంటి విభాగాల్లో పోటీలను నిర్వహించి ప్రతిభను కనబరిచినవారికి బహుమతులను అందించారు. పాఠశాల-తానా తెలుగు పోటీలను కూడా వివిధ నగరాల్లో నిర్వహించారు. ఫైనల్ పోటీలను తానా మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు. ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో తానా 22వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.













