అమెరికాలో విమానాన్నే దొంగిలించే యత్నం!
కళల్లో చోరకళ కూడా ఒకటి. కొందరికి కంటికి కనిపించే వస్తువులపై హస్తలా ఘవం ప్రదర్శించడం అలవాటు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా విమానాన్నే దొంగిలించే యత్నం చేశాడు. అమెరికాలోని ఒర్లాండ్ మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడిని కెనడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల ద్వంద్వ పౌరసత్వం కలిగిన నిషాల్ సంకట్ (22)గా గుర్తించారు. సంకట్ విమానాశ్రయం కంచెను దూకి లోనికి చొరబడ్డాడు. ప్రయాణికుల విమానం పైభాగానికి చేరుకున్న అతడు విమానాన్ని పరుగెత్తించేలోగా అక్కడున్న సాంకేతిక నిపుణులు, భద్రతా సిబ్బంది వెంటనే బంధించారు. అతను ఎందుకీ చర్యకు పాల్పడ్డాడో తెలియదని, ఈ ఘటన వెనుక తీవ్రవాద సంబంధం ఏదీ లేదని మెల్బోర్న్ పోలీసు అధికారి డేవిడ్ గిలెస్పీ పేర్కొన్నారు. సంకట్కు వాణిజ్య విమానాల లైసెన్సు ఉన్నా విమానాలను నడిపే అర్హత పొందలేదని ఒర్లాండొ మెల్బోర్న అంతర్జాతీయ విమానాశ్రయం అధికార ప్రతినిధి లోరి బుక్ తెలిపారు.













