నోబెల్ గ్రహీతల విరాళం
ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి అందుకున్న భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రైమర్లు తమ నగదు బహుమతిని పరిశోధనలకు విరాళంగా ప్రకటించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. వీరు దక్కించుకున్న సుమారు రూ.6.5 కోట్ల నగదు ఆర్థికాభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్న వీస్ ఫండ్‌కు అందించనున్నారు. ఈ సంస్థను ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది. తమ నిధులను ప్రపంచంలోని ఆర్థికవేత్తల అభివృద్ధికి అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని నోబెల్ గ్రహీతలు తెలిపారు. కాగా, పేదరిక నిర్మూలనపై విజయవంతమైన పరిశోధనలు చేసినందుకుగానూ వీరు నోబెల్ బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.













