అమెరికాలో అర్ధనారీశ్వరం!
ఇండియా అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ప్రతి సంవత్సరం మిడ్-సౌత్ లో జరిపే అతి పెద్ద వేడుక ఇండియాఫెస్ట్. ఇండియా ఫెస్ట్ 2018 నవంబర్ 3న వేలాది మంది ప్రవాస భారతీయులు మరియు భారాతీయేతరులు పాల్గొనడంతో మెంఫిస్ పట్టణం అగ్రిసెంటెర్ లో అట్టహాసంగా జరిగింది. ఇండియాఫస్ట్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాట్లని ఎంతో చక్కగా రూపొందించడమే కాదు ఆచరణాత్మకంగా ఎంతో మంది వాలంటీర్ల సహాయంతో నిర్వహించింది. మెంఫిస్ మహాపట్టణం మరియు షెల్బి కౌంటీ గవెర్నమెంట్ అధికారులు, స్థానిక సంస్థ అధిపతులు, కొన్ని వేలమంది విద్యార్థులు వెల్లివిరిసిన ఉత్సాహంతో పాల్గొన్నారు. స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు నోరూరించే భారతీయ వంటకాలతో విందు చేస్తే ఎందరో ఔత్సాహిక కళాకారులూ సాంస్కృతిక కార్య క్రమాలతో కళాభిమానుల్ని ఉర్రోతలూగించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలను అనుకరిస్తూ చేసిన నృత్యాలు ఒక ఎత్తైతే సాంప్రదాయ నృత్యాల ప్రదర్శన భారతీయ సంస్కృతిని మరియు సంప్రదాయాల్ని ప్రతిభింబించాయి.
ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఇండియన్ బాలే థియేటర్ చిన్నారులు నిధి నిహారిక చెన్నం, సహస్ర ససిపల్లి, అమృత గరుడాద్రి, సహస్ర తోట, శాన్వి కుంటమల్ల, అశ్విక బండారు, నందిని కొండిశెట్టి మరియు సాత్విక సెంథిల్ కుమార్ అర్థనారీశ్వర తాండవ-లాస్యం అద్భుతంగా ప్రదర్శించారు. ఆర్ట్స్ మెంఫిస్ మరియు టేనస్సీ ఆర్ట్స్ కమిషన్ ఆర్ధిక సహాయంతో స్పిరిట్యుయల్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమణ వాసిలి నేతృత్వం మరియు శిక్షణలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇందిరా మండలి మరియు శ్రీమతి సుష్మిత కుంటమల్ల చిన్నారులకి మేకప్ మరియు కాస్ట్యూమ్స్ తో సహకారాన్ని అందిస్తే శ్రీ వాన రత్నాకర్ ఆడియో మరియు వీడియో సహకారాన్ని అందించారు.
Dr. Ramana Vasili
Director, Spiritual Foundation
7062 South Beringer Drive
Cordova, Tennessee 38018
901-387-9646













