సాకర్ సంరంభం
ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌కు నగరా మోగింది. క్యాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించి, మెయిన్‌కు అర్హత సంపాదించిన 32 జట్లు పోరాడే ఈ మహాయుద్ధానికి సిద్ధంగా 736 మంది ఆటగాళ్ల మధ్య సంకుల సమరం నేడు రష్యా, సౌదీ అరేబియా జట్ట మ్యాచ్‌తో మొదలుకానుంది. గ్రూప్ దశలో మొత్తం ఎనిమిది గ్రూపులు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోని నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశ ముగిసిన తర్వాత, ఒక్కో గ్రూప్‌లో మొదట రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లాస్-16కు చేరుతాయి. ప్రీ క్వార్టర్స్‌గా పేర్కొనే ఈ స్థాయిలో నాకౌట్ పద్ధతిన మ్యాచ్‌లు జరుగుతాయి. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరితే, ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. అనంతరం నాలుగు జట్టు సెమీస్ చేరతాయి. అందులో గెలిచిన రెండు జట్లు మధ్య టైటిల్ పోరు ఉంటుంది.













