హరికేన్లో చిక్కుకున్న భారత విద్యార్థులు
వరదల్లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం వద్ద 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఆ ప్రాంతంలోని భారతీయులు, అమెరికన్లు వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం అందజేస్తున్నారు. హ్యూస్టన్లో భారత కాన్సుల్-జనరల్ అనుపమ్ రే బాధిత విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. భారత అమెరికా సామాజిక సేవాసంస్థలన్నీ బాధితులను ఆదుకునేందుకు శ్రమిస్తున్నాయని, భారతీయ రెస్టారెంట్లు ఆహార పొట్లాలను అందజేస్తున్నాయని హ్యూస్టన్లో నివసిస్తున్న నల్గొండవాసి కిశోర్ రామ రాజు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో షాలీనీ, నిఖిల్ భాటియా అనే విద్యార్థుల్ని అత్యవసర వైద్యసేవల విభాగంలో చేర్చినట్లు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్లో తెలిపారు. వారి బంధువులు ఆసుపత్రికి చేరేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.













