స్టెమ్ పోటీల ఫైనల్ జాబితాలో.. ఇండో అమెరికన్ విద్యార్థులు
అమెరికాలోని ప్రీమియర్ మిడిల్ స్కూలు స్థాయి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్ (స్టెమ్) పోటీల్లో మొత్తం 30 మంది విద్యార్థులు ఫైనల్కు చేరగా, ఇందులో 16 మంది ఇండో అమెరికన్లు కావడం వివేషం. ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన 300 మంది యువ ఆవిష్కర్తల నుంచి 30 మంది ఫైనలిస్టులను జాతీయస్థాయి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, విద్యావేత్తల కమిటీ ఎంపిక చేసినట్లు 20వ తేదీన ప్రకటన వెలువడింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పేరిట వాషింగ్టన్ డి.సి.లో వచ్చే నెల ఈ పోటీల ఫైనల్స్ జరగనున్నాయి. అభ్యర్థుల నైపుణ్యాలను న్యాయమూర్తుల ప్యానెల్ పరిశీలించి తుది విజేతలను నిర్ణయిస్తుంది. వీరికి రూ.83 లక్షల (లక్ష డాలర్లు) నగదు అవార్డులు ఉంటాయి.













