2వ సమగ్ర ప్రకటన: 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, అక్టోబర్ 21-22, 2023
మిత్రులారా,
13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, అక్టోబర్ 21-22, 2023 కి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా రెండవ ప్రకటన జత పరుస్తున్నాం…మీ కోసం..
డయాస్పోరా సాహితీ వేత్తలకి, ఇతివృత్తాలకీ ప్రాధాన్యత ఇస్తూనే, ప్రాచీన, ఆధునిక సాహితీ ప్రక్రియల కి, అన్ని దేశాల సాహితీ వేత్తలకీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం.
ఈ సమగ్ర ప్రకటనలో 13వ అమెరికా సాహితీ సదస్సు ప్రత్యేకతలు, ప్రధాన ఆశయాలు, నేపధ్యం మొదలైన వివరాలతో పాటు ఈ క్రింది అంశాలు చోటు చేసుకున్నాయి. ఆయా అంశాలకి మీ స్పందన కోరుతున్నాం.
1. వక్తలకి ఆహ్వానం. ప్రసంగాంశాలు, ఇతర విషయాలపై వక్తలకి సూచనలు.
2. వక్తలకి అందే పారితోషికం, స్థానిక ఉచిత వసతి సదుపాయాల వివరాలు.
3. విశ్వ విద్యాలయ స్థాయి సభా విశేష సంచిక (Proceedings of the 13th Telugu Literary Symposium of America) లో ప్రచురణకి ప్రత్యేక అవకాశాల వివరణ.
4. పుస్తకావిష్కరణ, చర్చా వేదికలు, స్వీయ రచనా పఠనం, సాహితీ పరిజ్ఞానం మీద సరదా పోటీ నిర్వహణ మొదలైన అంశాల మీద ప్రతిపాదనల ఆహ్వానం.
5. అన్ని అంశాలకీ తప్పని సరిగా పాటించవలసిన గడువు తేదీలు, ఆయా నిర్వాహకుల సమాచారం.
భవదీయులు,
13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కార్య నిర్వాహక వర్గం
సంచాలకులు (Convenors): మృత్యుంజయుడు తాటిపాముల, శాయి రాచకొండ:
ఆహ్వాన సంఘం అధ్యక్షులు: రాజు చమర్తి
కార్యదర్శి: శ్రీదేవి గంటి: భారత దేశ సమన్వయ కర్త: డా. సి. మృణాళిని
సంధాన కర్తలు: ఎస్. నారాయణ స్వామి, జీడిగుంట విజయ సారధి, పాణిని జన్నాభట్ల, కిరణ్ సింహాద్రి,
అధ్యక్షులు: ఆనంద్ కూచిభొట్ల (సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం), వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా)













