పాక్ లో భారీ విధ్వంసం
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై అర్థరాత్రి మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు వెయ్యి కిలోల బాంబులను జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేసింది. అర్థరాత్రి సమయంలో ఏం జరుగుతోందోనని ఉగ్రవాదులు మేల్కొనేలోపే మన పైలెట్లు పనికానిచ్చేశారు. పాక్ ఆర్మీ తేరుకునేలోపే భారత వాయుసేన టార్గెట్ పూర్తి చేసింది.
భారత ప్రతీకార దాడిలో పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. అంతేకాకుండా బాలాకోట్, చకోటి, ముజఫరబాద్లోని 3 ఉగ్రశిబిరాలు కూడా నేలమట్టం అయ్యాయని, భారత్ జరిపిన ఈ సర్టికల్ స్ట్రైక్-2లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా వేస్తున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఈ తరహాలో వైమానికి దాడులు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.













