రివ్యూ : కథ క్లైమాక్స్ కథనం బోరింగ్
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 1.5/5
బ్యానర్ : ఎఎ కంపెనీ, ఆర్ఎస్ఆర్ ప్రొడక్షన్స్
తారాగణం: మియా మాల్కోవా తదితరులు
కెమెరా : అగస్త్య మంజు
రచన: రామ్ గోపాల్ వర్మ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
(శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం)
విడుదల : 2020 జూన్ 6 రాత్రి 9 ఘంటల నుండి….
వివాదాస్పద అంశాలతో దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ తీసిన చిత్రం ‘క్లైమాక్స్’ ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ ఇంటివద్దనుండి వీక్షించే ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో నేటి ఓ టి టి సినిమాగా వచ్చిన ‘క్లైమాక్స్’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం. శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం అయ్యింది. ఈ సినిమా ఎప్పటికి ‘శ్రేయాస్ ఈటి అప్’లో అందుబాటులో ఉంటుంది. వర్మ మరో కొత్త ప్రయోగం తో అందించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
ఓ జంట (మియా మాల్కోవా, ఆమె ప్రియుడు) సరదాగా విహార యాత్ర కోసమని ఓ భయానిక ఎడారిలోకి వస్తారు. ఆ ఎడారిలో ఆ జంటకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే వాళ్లను కొంతమంది వింత వక్తులు భయపెడుతూ ఉంటారు. వారి నుండి తప్పించుకుని తమకు ఎదురైన సంఘటనలను ఆ ప్రాంతాలోని పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పటానికి ప్రయత్నం చేస్తోంది ఆ జంట. కానీ అక్కడ వాళ్లు మరో ఆపదలో చిక్కుకుంటారు. ఇంతకీ ఆ ఆపద ఏమిటి ? దాని నుంచి ఆ జంట ఎలా తప్పించుకుంది? ఈ మధ్యలో వాళ్లకు ఎదురైనా సవాళ్లు ఏంటి ? చివరకు వాళ్ళు ఏమైపోయారు ? అనేది మిగతా కథ.< /p>
నటి నటులు :
అయితే యూత్ ని ఆకట్టుకోవడానికి ఆర్జీవీ వాడుకున్న చీప్ ట్రిక్స్ మియా మాల్కోవా నగ్న దృశ్యాలు, ఘాటు ముద్దులు, ఆమె తొడల ఎక్స్పోజింగులు కొంతమేరకు ఆ వర్గం ప్రేక్షకులకు పర్వాలేదనిపించొచ్చు. కానీ వాటి కోసం మిగతా టార్చర్ అంతా భరించే ఓపిక బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు. ఇక మియా మాల్కోవా నటించడానికి గట్టి ప్రయత్నం అయితే చేసింది. మిగతా అరిటిస్టుల గురించి చెప్పడానికి ప్రత్యేకం గా ఏమి లేదు.
టెక్నికల్ గా…
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమిలేదు. ఒక్క అగస్త్య మంజు ఫొటోగ్రఫీ బాగుంది.
అసలు సినిమానే బాగాలేదు అనడం కరెక్ట్ ఏమో. 52 నిమిషాల నిడివి గల ఈ క్లైమాక్స్ సినిమాలో అరిగిపోయిన సౌండ్ ఎఫెక్ట్స్, విషయం లేని టెన్షన్ బిల్డప్ షాట్స్, మియా అనవసరపు పరుగులు, స్పోర్ట్స్ బైకుల పై ఎందుకు వచ్చి వెళ్తున్నారో తెలియని వ్యక్తులు, మధ్యమధ్యలో దెయ్యాల ప్రభావం.. ఇలా మొత్తంగా ఈ ‘క్లైమాక్స్’ ఒక చెత్త సినిమా. దీనికి తోడు పూర్తి ఎడారి నేపథ్యంలో సాగే ఈ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ,మినిమమ్ ఇంట్రస్ట్ కూడా లేకపోవడం కొసమెరుపు. అసలు సినిమాలో ఎలాంటి మలుపులు లేకుండా ఒకే విషయాన్ని పదేపదే చెబుతూ చాల సన్నివేశాలను అనవసరమైన ల్యాగ్ తో సాగతీయడం, అలాగే వర్కౌట్ కానీ ప్లే అండ్ హారర్ సీన్స్ తో ఆడియన్స్ బాగా బోర్ గా ఫీల్ అవుతారు.
విశ్లేషణ:
అసలు.. ఈ సినిమా తీయాలనే ఆలోచన రామ్ గోపాల్ వర్మకు ఎందుకొచ్చిందో.. (డబ్బు గురించి అనుకోండి) అయినా ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా ట్రీట్మెంట్ తో ఆ కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసి ఇంట్రస్టింగ్ ప్లేతో కన్విన్స్ గా చెప్పాలి. కానీ ఆర్జీవీ స్క్రిప్ట్ పై కనీస స్థాయిలో కూడా వర్క్ చేయలేదు.ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి ఎక్కువగా ముచ్చటించుకునే ఛాన్స్ మనకు ఇవ్వలేదు ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద అంశాలతో దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ తీసిన ఈ ‘క్లైమాక్స్’ సినిమాలో విషయం లేదు. మియా మాల్కోవాతో చూపించాల్సిందంతా వర్మ ట్రైలర్ లోనే చూపించేసాడు, అంతకు మించి సినిమాలో ఇంకేమి లేదు. సినిమా ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాలు, సినిమాలో సరైన ప్లో లాంటి అంశాలు ఈ సినిమా నుండి అస్సలు ఆశించలేం. అదే రొటీన్ తంతు వ్యవహారంతో వర్మ అడియన్స్ బాగా విసిగించాడు. పూర్తి స్థాయిలో నిరాశ పరిచే ఈ సినిమాని డబ్బులిచ్చి చూడక పోవటమే బెటర్.






