ఒకేసారి ముగ్గురు వారసులు ఎంట్రీ ?
హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్లో చర్చనీయాంశమైంది. జిందగీ నా మిలేగీ దొ బార, గల్లీభాయ్ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్వా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించనున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్ టాక్ మరి. ఈ వెబ్ ఫిల్మ్ తో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













