ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మరో హారర్ సినిమా!
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతపడడంతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగింది. కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు సైతం ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలను పక్కన పెడితే ఓ రేంజ్ సినిమాలను ఓటీటీ ద్వారానే రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు భాషల సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి ఆదరణ పొందుతున్నాయి. దాదాపుగా ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా `బెలూన్` సినిమా జీ5లో రిలీజ్‌కి సిద్ధమైంది.
జూలై 10న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. జై, అంజలి, జనని అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శినీష్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అతిథి పాత్రలో నటించాడు. కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో ఓ స్క్రిప్ట్ రాసేందుకు తన భార, మేనల్లుడుతో కలిసి ఊటీ వెళతాడు. అక్కడ ఓ పాత బంగళాలో ఉంటాడు. ఆ బంగళాలో అనుకోని విధంగా కొన్ని ఘటనలు జరుగుతాయి. దానివల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అనేది కథ. మంచి ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో హారర్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని జీ5 సంస్థ భావిస్తోంది. ఇప్పటికే జీ5లో 100కి పైగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రసారమయ్యాయి. వాటిలో ఎక్కువ శాతం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవే ఉండడం విశేషం.













