ఊహలు గుసగుసలాడే-గుండమ్మ కథ మహాసంగమం: జూలై 13, 14న స్పెషల్ ఎపిసోడ్స్ తో రెట్టింపు వినోదాన్ని పంచనున్న ‘జీ తెలుగు’
గత కొంతకాలంగా బుల్లితెరపై మహాసంగమం ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఐతే, పలు సీరియల్స్ యొక్క వరుస మహాసంగమం ఎపిసోడ్స్ తో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ తెలుగు’ ప్రేక్షకులను అబ్బురపరచడమే కాకుండా, ఈ ఫార్మాట్ లో అందరిని వెనక్కినెట్టి ముందు వరుసలో నిలుస్తూ వస్తుంది. ఇటీవలే ఇంటిగుట్టు మరియు మిఠాయి కొట్టు చిట్టెమ్మ మహాసంగమం ఎపిసోడ్స్ తో అలరించిన ‘జీ తెలుగు’, ఇప్పుడు ఊహలు గుసగుసలాడే- గుండమ్మ కథ మహాసంగమానికి శ్రీకారం చుట్టింది. జూలై 13 మరియు 14న మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు ఈ వినోదాత్మకమైన ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.
ఇక కథ విషయానికొస్తే, ఊర్లోని అమ్మవారు గత కొంతకాలంగా రక్తపు కన్నీరు కారుస్తుండడంతో ఊరి ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు జాతర నిర్వహించాలని నిర్ణయిస్తారు. ఇందులోభాగంగా, మాణిక్యం (గుండమ్మ కథ), తన సోదరివరుసైన జయంతి (ఊహలు గుసగుసలాడే) మరియు ఆ గుడిని కట్టించిన వంశీయులు పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఊరి ప్రజలు అమ్మవారికి తమ నగలను అమ్మవారికి అర్పించాల్సి (నిలువుదోపిడీ) ఉంటుంది. ఐతే, కొందరు ఇవేవి జరగకుండా అడ్డుకొని పూజలు నిర్వహిస్తున్న వారిని అవమానించాలనే పన్నాగం పన్నుతారు. ఇరు సీరియల్స్ లోని కథానాయకులు మరియు కథానాయికలు వారి ప్రయత్నాలను ఎలా తిప్పికొడతారో వివరిస్తూ ఈ ఎపిసోడ్స్ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది.
ఊహలు గుసగుసలాడే మరియు గుండమ్మ కథ సీరియల్స్ విభిన్న కథాంశాలతో సమాజంలోని మూస పద్దతులను (స్టీరియోటైప్స్) తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ఈ సీరియల్స్ లోని ప్రధాన పాత్రలు ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడంతో ‘జీ తెలుగు’ రెట్టింపు వినోదాన్ని పంచనుంది.
జూలై 13 మరియు 14న మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు ఊహలు గుసగుసలాడే- గుండమ్మ కథ మహాసంగమం ఎపిసోడ్స్ ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో.













