‘ఇంటి గుట్టు’, ‘మిఠాయికొట్టు చిట్టెమ్మ’ మహాసంగమం: జూన్ 30, జూలై 1న స్పెషల్ ఎపిసోడ్స్ తో కనువిందు చేయనున్న ‘జీ తెలుగు’
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ తెలుగు’ లో ప్రసారమవుతున్న ‘ఇంటి గుట్టు’ మరియు ‘మిఠాయికొట్టు చిట్టెమ్మ’ సీరియల్స్ వినూత్న కథాంశాలతో, రిలేటబుల్ కంటెంట్ తో తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ప్రేక్షకులను ఛానల్ ‘మహాసంగమం’ ఎపిసోడ్స్ తో కనువిందు చేయడానికి సిద్దమవుతుండడంతో, ఇరు సీరియల్స్ లోని నటీనటులను ఒకే ఫ్రేములో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. అంతేకాకుండా, సీరియల్స్ నిర్వాహకులు ఈ ఎపిసోడ్స్ ద్వారా జూన్ 30న మరియు జూలై 1న మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు గంటపాటు రెట్టింపు వినోదాన్ని ‘జీ తెలుగు’ వీక్షకులకు అందించనున్నారు.
వివరాల్లోకి వెళితే, ఈ మెగా ఎపిసోడ్ అనేక ట్విస్టులతో, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రసవత్తరంగా సాగనుంది. సంపద, సిద్ధు (‘ఇంటి గుట్టు’) మరియు కాంతమ్మ (మిఠాయికొట్టు చిట్టెమ్మ) మధ్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. డబ్బు కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉండే ఈ ముగ్గురి మధ్య వచ్చే ఒక సిట్యుయేషన్ ని ఇరు సీరియల్స్ లోని ఫీమేల్ లీడ్స్ ఐన కళ్యాణి మరియు చిట్టెమ్మ ఎలా ఎదుర్కుంటారనేది ఈ మహాసంగ్రామం ఎపిసోడ్స్ కి హైలైట్ గా నిలుస్తుంది.
ఈ గురువారం మరియు శక్రవారం ‘ఇంటి గుట్టు’ మరియు ‘మిఠాయికొట్టు చిట్టెమ్మ’ మహాసంగామం ఎపిసోడ్స్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు వీక్షించండి, మీ ‘జీ తెలుగు’ లో













