మహిళా దినోత్సవం సందర్భంగా జీ తెలుగు ఆత్మీయ గౌరవం శివంగివే
తెలుగు టెలివిజన్ రంగంలో అగ్రగామిగా రాణిస్తున్న ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు మహిళా సాధికారతలో నిరంతరం ముందుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జీ తెలుగు. మహిళల స్ఫూర్తిని, విజయాలను గౌరవించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులనూ జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం‘శివంగివే’ వేదికపై ఘనంగా సత్కరించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శివంగివే ఆదివారం (మార్చి 10) సాయంత్రం 6 గంటలకు, తప్పక చూడండి!
ఇది అన్ని రంగాలకు చెందిన మహిళల అమూల్యమైన కృషి, విశేష విజయాలను స్మరించుకోవడానికి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం. మహిళల ధైర్యసాహసాలు, విజయాలను గౌరవిస్తూ సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం మరిచిపోలేని అనుభూతులు, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల హృదయాలను తాకే ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల, హాస్యనటి కోవై సరళ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జీ తెలుగు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిహారిక, కోవై సరళ తమదైన రీతిలో కామెడీ చేసి నవ్వించడమే కాకుండా హృదయాలను తాకే స్కిట్స్‌తో ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తారు. వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వరుస ప్రదర్శనలు వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. స్ఫూర్తిదాయకమైన జుల్కర్ నృత్యప్రదర్శనతో మొదలై హారికా నారాయణ్, రమ్య బెహరా, వాగ్దేవి శ్రావ్యమైన గానం వరకు శివంగివే కార్యక్రమం ప్రతి హృదయాన్ని ఆనందం, సంతోషభరిత క్షణాలతో నింపుతుంది. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో పాటు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టులు కృష్ణవేణి, గాయత్రి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ వేదికపై దివంగత నటుడు తారకరత్న సినీ ప్రయాణాన్ని ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అందించారు. ఉద్వేగభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, కూతురు నిషా ఆయనను గుర్తుచేసుకుంటూ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తారు. హృదయానికి హత్తుకునే క్షణాలు తారకరత్న జీవితాన్ని కళ్లముందు కదిలేలా చేస్తాయి. ప్రముఖ ఉర్దూ కవయిత్రి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారిణి జమీలా నిషాత్ జీవితం ఆధారంగా రూపొందిన నాటకంలో ఆషికా పదుకొణె నటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం ‘శివంగివే’ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనలు, హృదయపూర్వక నివాళులు మరియు చిరస్మరణీయ క్షణాల ద్వారా, ఈ కార్యక్రమం సమాజంలో మహిళలు సాధించిన విశేష విజయాలను మరోసారి స్మరించుకునేందుకు వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరూ మిస్ అవకుండా చూసేయండి.
మహిళామణులకు జీ తెలుగు గౌరవనీరాజనం శివంగివే, మార్చి 10 ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!













