మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చుడండి, విలువైన బహుమతులు గెల్చుకోండి, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!
వారం వారం సరికొత్త సినిమాలను అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైంది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించనుంది. టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి, టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డిసెంబర్ 24, ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ లండన్ కు చెందిన మాస్టర్ చెఫ్ అయిన అన్వితా రవళి శెట్టి (అనుష్క శెట్టి పాత్ర) జీవితం చుట్టూ తిరుగుతుంది. పెళ్లి కాకుండానే తల్లి కావాలని నిశ్చయించుకుని, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని తన బిడ్డకు తండ్రిగా ఎంచుకుంటుంది. అన్విత ఉద్దేశం తెలియని సిద్ధూ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ఉద్దేశాల గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. సిద్ధూ అన్విత నిర్ణయానికి అంగీకరిస్తాడా? అన్విత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అన్విత ప్రయాణం తప్పకుండా అందరి హృదయాలను హత్తుకుంటుంది.
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మురళీశర్మ, అభినవ్ గోమఠం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, మహేష్ ఆచంట, భద్రం తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మహేష్ బాబు పి దర్శకత్వం, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో లో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానున్న ఈ సినిమాను మీరూ మిస్సవకండి!
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను మరింత ఉత్సాహపరిచే విషయం ఏమిటంటే, జీ తెలుగులో సినిమా ప్రసారం సమయంలో, ఛానల్ ఒక ఆకర్షణీయమైన పోటీని నిర్వహిస్తోంది. సినిమా ప్రసారం అంతటా ప్రేక్షకులు ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు వీక్షకులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయవచ్చు లేదా ఇచ్చిన నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ప్రతి ప్రశ్న తరువాత లక్కీ విజేతలకు అద్భుతమైన బహుమతులు అందజేస్తారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మాత్రమే, తప్పక చూడండి!













