జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ కార్యక్రమంఈ శనివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో..!
నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్ జీ తెలుగు. ఎదురులేని ప్రయాణంలో ఛానల్ ఉన్నతికి తమవంతు కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు.. అందరినీ గౌరవిస్తూ అందించే సత్కారమే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.
ప్రతిష్ఠాత్మక జీతెలుగు కుటుంబ అవార్డులను అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతిఏటా ఘనంగా జరిగే జీతెలుగు కుటుంబం అవార్డ్స్వేడుక ఈసంవత్సరం మరింత వైభవంగా జరిగింది. జీతెలుగుతారలు, టాలీవుడ్ ప్రముఖులతో సందడిగా సాగిన జీ తెలుగుకుటుంబం అవార్డుల ప్రదానోత్సవకార్యక్రమ మొదటిభాగం అక్టోబర్ 12 సాయంత్రం 6 గంటలకు, మీ జీతెలుగులో.. తప్పకచూడండి!
టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 కార్యక్రమానికి ఎనర్జిటిక్ జోడీ రవి- లాస్యవ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జీ తెలుగు సీరియల్స్ కుటుంబాలన్నీ కలగలసి ఊరేగింపుతో ఘనంగా మొదలైన కార్యక్రమం అద్భుత ప్రదర్శనలు, అనుభవాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. ఇక, జీ తెలుగు పాపులర్ సీరియల్స్ పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ఆడే ఫజిల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటీనటులు భానుచందర్, అర్చన ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకుని నవ్వులు పూయించారు.
జీ తెలుగు సీరియల్ జంటలతో సాగే మ్యూజికల్ డాన్స్ వార్‌లో సరిగమప సింగర్స్ పోటాపోటీ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వేడుకకు మెగాబ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై జీ తెలుగుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.
యాక్షన్ ప్రియుల కోసం లైవ్లోగగన్ రౌడీలతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగుతుంది. డాన్స్ కాంపిటీషన్లో భాగంగా జూనియర్లు రెట్రో ప్రదర్శన ఇవ్వగా, సీనియర్లు ట్రెండింగ్ పాటలకుడాన్స్ చేసి అలరిస్తారు. రామలక్ష్మి &శౌర్య, ఆద్య &శ్రీను, రూప &రాజు, శ్రీకర్ &అవని జంటలు వేదికపై చేసే సందడి సరదాగా సాగుతుంది. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ సీరియల్ కోడళ్లతో చేసే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏఅవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి.
రెడ్ కార్పెట్‌పై వెండితెర ప్రముఖుల సందడి.. బుల్లితెర తారల హంగామా.. అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి 10:30 గంటలకు,జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 అక్టోబర్ 12 శనివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీ తెలుగులో!













