జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2023, ఈ ఆదివారం మీ జీ తెలుగులో!
ప్రారంభించిన రోజునుంచీ ప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో జీ తెలుగు తిరుగులేని ఎదుగుదల కొనసాగుతోంది. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను ప్రదానం చేయడం ద్వారా అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా వైభవంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం మరింత ఘనంగా జరిగింది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2023 వెండితెర, బుల్లితెర తారల తళుకులు తో అత్యంత వైభవంగా సాగిన కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 29 సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మిస్ అవకుండా చూడాల్సిందే.
అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్ రవి-శ్యామల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో పుట్టింటి వెలుగు, ఆత్మీయ పురస్కారం, జీ తెలుగు చిచ్చర పిడుగు, రొమాంటిక్ కపుల్, బెస్ట్ కెమిస్ట్రీ, ఉత్తమకోడుకు, జీ నారీ శక్తి, జీ తెలుగు వెలుగు, ఉత్తమ టైటిల్ సాంగ్ తదితర విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు విజేతలు, విజేతలకు అవార్డులు అందజేయడానికి విచ్చేసిన ప్రముఖులతో కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తారల యొక్క మంత్రముగ్ధులయ్యే నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి.
ఈ కార్యక్రమంలో జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు నేచురల్ స్టార్ నాని, రామ్ గోపాల్ వర్మ, సంయుక్తా మీనన్, రేణు దేశాయ్, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, అనంత్ శ్రీరామ్, సుమ-రాజీవ్ కనకాల, రఘు బాబు, పాయల్ రాజ్‌పుత్, కావ్య కల్యాణ్ రామ్, అనసూయ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఘనంగా జరిగిన వేడుకల్లో, టెలివిజన్ సూపర్‌స్టార్ నిరుపమ్ పరిటాల అదిరిపోయే గిప్ట్ అందుకున్నారు. ఇక, హృదయాలను హత్తుకునే ఈ ప్రదర్శనలతో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ మొదటి భాగం దీప్తి & సౌందర్య జగదాత్రి స్కిట్, తెలుగు మీడియం ఐస్కూల్ పార్టిసిపెంట్స్ ప్రదర్శన, డ్రామా జూనియర్ పిల్లల ఆహ్లాదకరమైన స్కిట్లతో ఆద్యంతం వినోదంగా సాగుతుంది. ఈ షోలో మగువా మగువా పాటకి ప్రముఖ నటి జయప్రద చేసిన అద్భుతమైన ప్రదర్శన, రెట్రో సాంగ్స్ లో అనసూయ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, వర్ష, నిషా& సౌందర్య నటించిన బార్బీ స్కిట్ కూడా అందరినీ అలరిస్తాయి. ఇక, ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలపడం విశేషం. సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు, అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసిన భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంగరంగ వైభవంగా జరిగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2023 పార్ట్-1 ఈ ఆదివారం మీ జీ తెలుగులో, మీరూ మిస్ అవకుండా చూడండి!













