పోటాపోటీ సమరంలో గెలిచి కిరీటం దక్కించుకునేది ఎవరు? సూపర్క్వీన్ 2 ఫినాలే..
సరికొత్త కాన్సెప్టులతో వారం వారం ప్రేక్షకులకు అంతులేని వినోదం పంచుతున్న జీ తెలుగు సూపర్ క్వీన్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. అందం, ప్రతిభతో కూడిన అద్భుత ప్రదర్శనలతో ముగిసిన సెమీ ఫైనల్లో టాప్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ తుది సమరానికి చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో పోటీపడిన సూపర్ క్వీన్స్‌లో ఎవరు కిరీటాన్ని దక్కించుకున్నారో తెలియాలంటే సూపర్ క్వీన్ సీజన్ 2 ఫినాలే చూడాల్సిందే. సూపర్క్వీన్ 2 ఫినాలే జూలై 23 ఆదివారం ఉదయం 11 గంటలకు, మీ జీ తెలుగులో!
చివరి ఎపిసోడ్ లో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు ఫైనలిస్టులందరితో కలిసి స్టేజ్ పైకి వెళ్లడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. టాప్ 5కి చేరిన కంటెస్టెంట్లు సూపర్ క్వీన్ లో తమ అనుభవాలను, ఫైనల్ కు తమను తాము ఎలా సిద్ధం చేసుకున్నారో పంచుకోనున్నారు. ఫినాలే ఎపిసోడ్లో ఇచ్చే టాస్క్‌లలోనూ వారు చివరిసారిగా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. కంటెస్టెంట్లు బ్రిక్స్ ఎత్తడం, వెయిట్ గేమ్ వంటి పలు కష్టతరమైన టాస్క్‌లు చేయనున్నారు. తుది అంకానికి ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్న సూపర్ క్వీన్ సీజన్ 2 ఫినాలే వినోదభరితంగా సాగనుంది. రియాలిటీ షో ఫినాలే ఎపిసోడ్లో కంటెస్టెంట్లు తమ వంతు కృషి చేయనున్నారు. ఆకట్టుకునే సరదా ఆటలతో పాటు సుహాసిని, మౌనిక, లిఖిత, ఎస్తేర్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
జీ తెలుగు సూపర్ క్వీన్ 2లో పోటీదారులంతా సత్తా చాటారు. సూపర్ క్వీన్ 2 కిరీటం కోసం సాగే చివరి పోటీ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. సూపర్క్వీన్ వేదికగా పోటీదారులు తమ అందం, ప్రతిభతో ప్రదర్శనలిచ్చి వినూత్నంగా పోటీపడుతున్నారు. ఫినాలే ఎపిసోడ్‌లోను రొటీన్‌కి భిన్నంగా సరికొత్త కాన్సెప్టులతో కూడిన టాస్కులతో టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడతారు. ఈ ఐదుగురిలో కిరీటం దక్కించుకునేది ఎవరనేది తెలుసుకోవాలంటే జీ తెలుగు అందిస్తున్న సూపర్క్వీన్ 2 ఫినాలే ఎపిసోడ్ చూడాల్సిందే!
జీ తెలుగు సూపర్క్వీన్ 2 గ్రాండ్ ఫినాలే, జూలై 23 ఆదివారం ఉదయం 11 గంటలకు, తప్పక చూడండి!













